STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీ డైరీ

నీ డైరీ

1 min
6



ఎవరైనా చదివేలా..ఉండాలోయ్ నీ డైరీ..! 
ఎవరికైన ఆదర్శం..కావాలోయ్ నీ డైరీ..! 

విజయాలో ఓటములో..అనుభవాల బింబాలే.. 
ఎప్పటికీ అద్దంలా..నిలవాలోయ్ నీ డైరీ..! 

పోరాటం ఏమిలేదు..నిజసాహస యాత్ర బతుకు.. 
నేర్చుకునే ఆసక్తిని..పెంచాలోయ్ నీ డైరీ..! 

చేసిన తప్పే మళ్ళీ..చేస్తూ చెబుతా వేంటోయ్.. 
చెప్పకనే పాఠాలను..చెప్పాలోయ్ నీ డైరీ..! 

మౌనాక్షర దీపాలను..వెలగనిమ్ము నీహృదిలో.. 
సంప్రదాయ పరిరక్షణ..చేయాలోయ్ నీ డైరీ..! 

కాలం చెక్కిన శిల్పం..చెక్కుచెదర దెన్నటికీ.. 
సత్యం చాటే పనిలో..వెలగాలోయ్ నీ డైరీ..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics