నీ చూపులు
నీ చూపులు
ముద్దొచ్చే ముద్దిచ్చే.వానంటే నీ చూపే..!
అచ్చంగా లాలించే..పాటంటే నీ చూపే..!
ఏమైనా ఎపుడైనా..తోడుండే నా నీడా..
ఎడతెరిపే ఎఱుగని ఓ..రక్షంటే నీ చూపే..!
గుట్టేదో రట్టయ్యే..వేళైతే ఆగేనా..
నానేనుల గూడుకు..ఓ నీడంటే నీ చూపే..!
ఇల్లేమో చల్లంగా..మనసేమో వెచ్చంగా..
తాపాలను వదిలించే..తోటంటే నీ చూపే..!
స్వచ్ఛంగా సత్యంగా..నడిపించే జాణవులే..
నా శ్వాసకు వరమయ్యిన..ధారంటే నీ చూపే..!
ఒక మాయని వెన్నెలంటి..నిజమింతే మనసా..
నా గుండె కంజీరాకు..ఊటంటే నీ చూపే..!

