నీ చూపుల దారాలతొ
నీ చూపుల దారాలతొ
నీ నవ్వుల నదిలో నను..విసిరేస్తే చాలు..!
నీ చూపుల దారాలతొ..అల్లేస్తే చాలు..!
మాయచేయు మాటలసలు..మనమధ్యన వద్దు..
మన చెలిమిని చెలిమిగనే..పంచేస్తే చాలు..!
పలుకుతేనె రాగాలకు..కలల గంధమేదొ..
నీ పదముల సన్నిధిలో..రాల్చేస్తే చాలు..!
నే వ్రాసిన లేఖలన్ని..ప్రయాసలే నిజము..
నా లోపలి వేదన'నే..కాల్చేస్తే చాలు..!
మనసు పడే ఆరాటం..తెలియనిదే మనసు..
సరిగ తెలిసి పోరాటం..నిలిపేస్తే చాలు..!

