నీ చిరునవ్వు
నీ చిరునవ్వు
ఎల్లపుడూ నీ చిరునవ్వుల
జల్లులలో తడిచిపోతూ.....
నీ మాటల మధురిమలో తేలిపోతూ
నీ ఊహల ఊయలలో ఊగిపోతూ...
నీ తలపుల తుంపరలో
తలమునకలవుతూ....
అనునిత్యం నీ విరజాజుల
పరిమళాన్నై పరవశిస్తూ
నీ లోకంలో విహరిస్తూనే ఉన్నా......
నిన్ను చేరుకోవడంలో
నేను ఓడిపోయానేమో కానీ.....
నిన్ను తలుచుకోవడంలో
ప్రతి రోజు గెలుస్తూనే ఉన్నా ....

