నీ చెలిమి
నీ చెలిమి
నీ చెలిమి కోరుతూ.
తపమునే చేశాను
నీ జతన నిలిచేటి
వరమునే కోరాను
వెలుగుతో వేకువకు
ఏ నాటి స్నేహమో
నీడవై నా తోడు
ఎప్పుడూ ఉంటావు
ఏ జన్మ పరిచయానివో
ఈ జన్మలో ప్రేమ బంధమయ్యావు
కలగలిసిన చోట మధుర జ్ఞాపకాలు
మదిలో ఉభయ తారకవై
అక్షర అల్లికలకు
ఆణి ముత్యానివైనావు
ఎదలో అలల అలజడిలా
ఎగిసే కెరటమై నాట్యమాడేవు..
., సిరి ✍️❤️

