నెలవంక
నెలవంక
నన్నుచూసి నవ్వుకునే..నెలవంకను చూశాను..!
నా కోసం కలలుగనే..నవకలువను చూశాను..!
నిదురించక ఎదురుచూచు..పొదరిల్లే తనమనసే..
చీకటితో మాటలాడు..శశిబాలను చూశాను..!
వినోదించు విరహంతో..చెలిమినేల నెఱపునో..
చెదరని పదునారు కళల..దరహాసను చూశాను..!
అనురాగపు సిరులరాశి..చిత్రమేల గీసేది..
తనువునేలు చైతన్యపు..కాంతిలతను చూశాను..!
అక్షరాల వీణియలో..సంగతులకు రూపమా..
ప్రియకవితా వనరాణీ..స్వరసీమను చూశాను..!

