నేస్తమా..
నేస్తమా..
పడిలేచే కెరటం చెబుతోంది ఓ సత్యం..........
పడిపోవటం సహజం తిరిగి లేవటమే నీ ధర్మం........
సాగేటి పయనం నిలుపుకో జ్ఞాపకం...........
చేరేటి గమ్యం పైవాడిదే ఆ విజయం...........
బ్రతుకంటే చదరంగం పావులేగా అందరం............
ప్రతిరోజూ ఓ కదనం అందుకో అందలం............
గమనాలు సాగే తీరూ.....ఉంటుంది తారతమ్యం.....
గగనాలు చేరే వారూ.....వెంట తీసుకెళ్ళేది శూన్యం...
కనుతెరిచి మూసేలోగా గడపాలి జీవితం...........
ఇంతలో ఎందుకు ఆత్రం కాదేదీ శాశ్వతం...........
చిరునవ్వు దీపపు వెలుగే అందివ్వు సంబరం..........
మానవత్వాల జిలుగే తారలున్న అంబరం............
చరితగా మిగలాలంటే తెలుసుకో మనిషంటే అర్ధం....
జన్మకి సార్ధకత్వం సాధించుకో నేస్తం..........
... సిరి ✍️❤️

