STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నేస్తమా

నేస్తమా

1 min
175


ఉదయించే రాగాలకు ఊపిరెవరు నేస్తమా 

మనసులోని భావాలకు ఊతమెవరు నేస్తమా 


ఊహలలో విహరించని హృదయమసలు ఉంటుందా

అంతరంగ పయనానికి సాక్ష్యమెవరు నేస్తమా 


అనుభూతుల కావ్యానికి మూలమేమిటో మరి

మనసులోని మౌనానికి తోడెవ్వరు నేస్తమా 


చూపుతాకు దృశ్యాలు నిట్టూర్పుకు గాయాలు

జ్ఞాపకాల యాత్రలోన సాయమెవరు నేస్తమా 


అందమైన ఆశయాలు అలవికాని దుఃఖాలు

స్వార్ధమైన లోకంలో బాసటెవరు నేస్తమా 


హసితాలే అలిగాయా ఆనందం వెలివేస్తూ

సంతోషపు స్వర్గానికి జోడెవ్వరు నేస్తమా 


Rate this content
Log in

Similar telugu poem from Romance