నేస్తమా...
నేస్తమా...
నా కనుల ఎదురుచూపు నీ కోసం...
నా హృదయాలాపన నీ కోసం...
ఈ క్షణం నా మనసులో
మెదిలే భావాల సమూహం నీ కోసం
నిన్ను చూసే ఆ క్షణం కోసం...
నాకందరూ ఉన్నప్పుడు
నువ్వొచ్చావు..తెలియలేదు
నా అనుకున్న వాళ్ళు నన్ను
వదిలేసినా నను వీడలేదు..
కష్టం,నష్టం,బాధ, బరువేసి మోయలేనప్పుడు.
నేనున్నా పదమంటూ నా బరువుని మోసావు..
లోకం నన్ను నమ్మనప్పుడు వీధిసైతం
వేధించినప్పుడు..నాకంటూ..
నిలిచిన నా దైర్యం నువ్వే.... నేస్తమా
... సిరి ✍️

