నేనూ కవినే
నేనూ కవినే
కలం పట్టుకొని వ్రాయను
పుస్తకాలు పట్టుకొని తిరగను
కానీ నేను కవిని
ఫేస్బుక్ స్టేటస్ లోనూ,
ట్విట్టర్ ట్వీట్లలోనూ,
ఇన్స్టాగ్రామ్ స్తోరీల్లోనూ,
మరెన్నో ఆన్ లైన్ వేదికల్లో,
వ్రాస్తుంటా కవితలు,
సూర్యోదయం గురించి వ్రాయలేదు,
కానీ గాజు గోడల గదుల్లో,
సూర్య కాంతి పడినట్లు అనిపించేలా వ్రాయగలను,
సూర్యాస్తమయ ప్రకృతిని వర్ణించలేను,
కానీ చీకటి గదుల్లో మగ్గే వారికి వెలుతురు చెడ్డది కాదని చెప్పేలా వ్రాయగలను,
ప్రేమ కవితలు వ్రాయలేను,
కానీ విఫలమైన ప్రేమికుల మనసుకు
నా కవితలతో సాంత్వన చేకూర్చగలను,
రాజుల, బలవంతుల గొప్పను వర్ణించలేను,
కానీ జీవిత పోరాటంలో అలసి పోతున్న సగటు మనిషికి నువ్వు ఒంటరివి కాదు అని చెప్పేలా
వ్రాయగలను,
కలం పట్టుకొని వ్రాయను,
పుస్తకాలు పట్టుకొని తిరగను,
కానీ,
నేనూ కవినే.