నేను ప్రేమించడం లేదు నిన్ను
నేను ప్రేమించడం లేదు నిన్ను
ప్రేమించడం లేదు నిన్ను
అవును
నిజంగానే !
ప్రేమించడమే లేదు నిన్ను
ఐనా నీ అనుపస్థితిలో
శూన్యంలో దేవులాడుకుంటాను
ఎక్కడ నీవని
ఆ నీలాకాశం కూడా
రగిలి పోతూంది అసూయతో
నక్షత్రాలన్నీ నిన్ను చూసి
వెలిగిపోతున్నాయని సంతసంతో
ఎందుకో తెలియదు
నేను ప్రేమించడం లేదు నిన్ను !
నువ్వు చేసే ప్రతి పనీ
నాకొసమే మరి!
ప్రేమిద్దామన్నా ఎవరినైనా
నీకన్నా ఉన్నతులు కనిపించరే!
అందుకే తరచుగా
నిట్టూరుస్తా ఏకాంతంలో
ప్రేమించడం లేదు నిన్ను....
అదేమిటో ఎవరైనా నిన్ను "డియర్" అంటే
నాకెంత అసూయో...ఆగ్రహమో !
మీటిన వీణలా వుండే నీ స్వరం
నా చెవిలో రింగు రింగుమని ప్రతిధ్వనిస్తుంటే
వాడి డియర్ శబ్దానికి
తెగిపోతుంది
నేను నిన్ను ప్రేమించడం లేదు...
ఐనా నీ మాట్లాడే కనులు
నీ లోతైన కనులు
కాంతిని ఉద్గారం చేసే నీ కనులు
నాతో సంభాషించే నీ కనులు
ఎక్కడైనా చూశానా అని ఆలోచిస్తా
స్వర్గం కనిపిస్తుంది
నాకూ నడిరాత్రికీ నడుమ
నేను నిన్ను ప్రేమించడం లేదు...
ఐనా నా నిర్మలమైన హృదయాన్ని...
ఎవరికీ అంకితం చెయ్యని నా గుండెను...
ఎవరూ నమ్మడంలేదు
ఏ యువతీ ముందుకు రాదేం !?

