STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నేనెవ్వరు

నేనెవ్వరు

1 min
6


సరియైనది ఇదేనంటు..నిర్ణయించ నేనెవ్వరు..!? 
తగుదునంటు ఎవరినైన..విమర్శించ నేనెవ్వరు..!? 

విలువల విలువలు కాచే..వలువలెలా ఉంటాయో.. 
మరి తెగబడి పోతుంటే..సంస్కరించ నేనెవ్వరు..!? 

చూస్తూ ఉండుట కన్నా..చేయాల్సిన దేమిలేదు.. 
అలాకాదు ఇలా అంటు..విబేధించ నేనెవ్వరు..!? 

చిరునవ్వై జీవించే తీరునేర్పు బడులేవట.. 
తీరుబడిని కానుకగా..సమర్పించ నేనెవ్వరు..!? 

ప్రేమించే సంగతినే..పెదవివిప్పి చెప్పనేల.. 
అసలు ప్రేమ రహస్యాన్ని..ప్రబోధించ నేనెవ్వరు..!? 

సమభావం అపరిమితం..కాచేందుకు కుదిరేనా.. 
'నన్ను-నేను' గాకెవరినొ..ఉద్ధరించ నేనెవ్వరు..!? 



Rate this content
Log in

Similar telugu poem from Classics