నేనెందుకు
నేనెందుకు
ముల్లేమో అంటున్నది..మాటలలో నేనెందుకు..!?
పువ్వేమో అంటున్నది..పూజలలో నేనెందుకు..!?
లేని మనసు చేయు మాయ..కల్లోలం సంసారం..
కొలనేమో అంటున్నది..గొడవలలో నేనెందుకు..!?
పీడించే కర్మలన్ని..పట్టుకున్న కలలేగా..
మబ్బేమో అంటున్నది..ఊహలలో నేనెందుకు..!?
నిన్నునీవు చెక్కుకోగ..పనేముంది ఓ ఉలితో..
తానేమో అంటున్నది..కవితలలో నేనెందుకు..!?
ఈ కత్తులు తుపాకీలు..బాంబులన్ని వృథాయేగ..
మతమేమో అంటున్నది..కలతలలో నేనెందుకు..!?
పేదరికం కన్నగొప్ప..గురువేదోయ్ .
పరువేమో అంటున్నది..మంటలలో నేనెందుకు..!?

