నేనేమివ్వగలను
నేనేమివ్వగలను
ఒంపుల సొంపుల వయ్యారి నదిలా ప్రవహించే నన్ను పలకరించి పులకరించే
నీకోసం వేచి చూసానునీ జాడ తెలియలేదు....
వేగాల జలపాతాన్నై, ఉత్తుంగ తరంగాన్నై ఉరికినప్పుడు
ఆ ఉరుకుల పరుగుల నురుగులలో
తడిసి,మురిసి పరవశించేందుకు నీవు రాలేదు.
ఆనకట్టలో ఒదిగి , చేనుగట్టులో నిలిచి
పచ్చని పైరుగా మారిన నాకోసం వచ్చిన నీకు ...నేనేమివ్వగలను.....
నీకోసం నేనేమి చేయగలను?

