Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

నే వినేలా నీవనవా !

నే వినేలా నీవనవా !

1 min
300



ఈ వేళ నాలో పరవశం . నా మనసే ఐనదేమో నీ వశం .

నీవే ఎదుట . కనులకు కనిపించక .

ఎదలోనూ మోహపు జ్ఞాపికలు . ఆగక .

సమయం ఉదయమో , సాయంత్రమో తెలియక .

చుట్టుప్రక్కల సమరమే జరుగుతున్నా ,

నేనున్నా నీ తలపులలోనే , కొంచెమైనా చలించక !


నింగి నేల వేరైనా

ఎన్నటికీ అవి చేరువకాలేనివి ఐనా

ఒకటికి ఒకటి అద్దంలా .

విడిచి ఉండలేనివే అనిపించేలా !


నీరు గాలి ఆ మధ్యలో ఎంతలా తిరుగాడినా ,

ఏ ఒక్కటి వెల్లువలా నిలువెల్లా చెలరేగినా ,

రెండవది చూస్తూ ఊరుకొనునా ?

ఏకమై విలయతాండవమే సృష్టించవా !


నీవు నేను అంతే కాదా ?

ఎంతసేపైనా ఒకరినొకరం తలుస్తూనే ఉన్నా ,

చూపులతో యుద్ధానికో ,

పంచుకోవాలని ముద్దులతోనో సంసిద్ధమో కామా !


ఉత్సాహమే ఊరించగా ,

ప్రేమనే కలిగించేదిగా ఆ ముచ్చటలోని వెచ్చదనం

మనలో నవ్వులు పూయించేదే కదా ,

దూరాన్నీ తగ్గించేదే అని నే వినేలా నీవనవా ! 😀



Rate this content
Log in