నెచ్చెలి
నెచ్చెలి
కనులకు కనిపించని
నీ అందమైన రూపాన్ని
గుండెలో పదిలంగా దాచా
చెవులకు వినిపించని
నీ హృదయరాగాన్ని
శ్వాసలో బంధించా
ఊపిరిలో ఊపిరిగా
ప్రాణంలో ప్రాణంగా
నీ ఆరాధనలో లీనమై
నీకోసం నిరీక్షిస్తూ
మరుజన్మలోనైనా
నీ ప్రేమను పొందుతానని ఆకాంక్షిస్తూ
నీ ప్రేమకోసం పరితపించే.......
నీ నెచ్చెలి

