STORYMIRROR

Sita Rambabu Chennuri

Inspirational

4  

Sita Rambabu Chennuri

Inspirational

నాన్న

నాన్న

1 min
295


అవును అతను నిశ్శబ్దనదిలా

దూరంగా వినిపించే సెలయేటిపాటలా 

నువు దాచేసిన 

నీ అంతరంగంలో మెరుపుచుక్కలా మెరుస్తూఉంటాడు...


నిను అదిలించి బుజ్జగిస్తూ

విసిగిస్తూ కోపగిస్తూ

నీ తప్పటడుగులనుంచి

నీ తప్పుటడుగులవరకూ

నీలోని మరోమనిషిలా

నిలదీస్తూనే ఉంటాడు...


అక్కడో జ్ఞాపకాలతోట విరుస్తోంది

నువ్వొద్దనుకున్నా

నీకోసమో పువేదోపూచినట్టు

అతని జ్ఞాపకం అక్కడ గాలిపరిమళమై వీస్తూ ఉంటుంది...


కదంబవనమై విరబూసే కుటుంబంలో

ఒంటరి దీపస్థంభంలా

అతను 

తపనో బెంగో చింతో తెలియని

పారవశ్యంతో

నీప్రేమగీతాన్ని నిరంతరం లిఖిస్తూ ఉంటాడు...


పండువెన్నెలలాంటి నీ జీవితంలో

తను మోడువారినబీడై

నీ ప్రేమపలకరింపుతో చిగురించుదామని

కలలసౌధానికి కళ్ళెంవేద్దామని విఫల ప్రయత్నం చేస్తూ ఉంటాడు

అతనే నాన్న

అందరికన్నా మిన్నగా

నీ ఠీవిని ఎగరేసే తొలి పతాక

నీ కీర్తితారక.








Rate this content
Log in

Similar telugu poem from Inspirational