నాలుగోది.....శ్రీనివాస భారతి
నాలుగోది.....శ్రీనివాస భారతి
నాలుగు వేళ్ళు నోట్లో కెళ్లాయి
మొదటిది
ఇవాళ నాకష్టం ఈ ముద్ద అంటే
రెండోది
మరొకరి శ్రమ పంచుకున్నాను అంది
మూడోది ముద్దుగా
మానవత్వం తోడుగా
నాలుగోది మాత్రం
ఇవాళ అడ్డదారి సంపాదన
ఆహా...కడుపు నిండిపోయింది
మిగిలిన
మూడూ
శరీరాన్ని వదిలేసిపోతే
మిగిలింది
రోగం, మరణం...అంతే
అందుకే అది
చూపుడు వేలైంది
తన
నాలుగు లోపాల్ని దాచేసి
చూపుడు వేలు బైటకెళ్తోంది....
----------*************----------