STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Inspirational

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Classics Inspirational

నాలోని నేను

నాలోని నేను

1 min
351

మానవత్వం ముసుగు తొడుక్కున్న

నేను మానవతావాదిని,


మమతకు అర్థం తెలియని నేను

మాతృత్వపు మరో రూపాన్ని,


కరుణను చూపించని నేను

కారుణ్యమూర్తిని,


ప్రేమను ప్రేమించలేని నేను

అమర ప్రేమికురాలిని,


నేను-నాది అనే స్వార్థపు ముసుగులో

జీవిస్తున్న నేను ఆదర్శవాదిని,


నిత్య పూజలు చేసే నేను

దేవుణ్ణి కూడా మోసం చేసే నాస్తికురాలిని,


అబద్దాన్ని అసహ్యించుకునే నేను

నిత్య అసత్యవాదిని,


నాలోని లోపాలను నేను చూసుకోలేక

ఆత్మ పరిశీలన చేసుకోలేక,


కళ్లు మూసుకొని మంచితనపు ముసుగులో

మానవత్వం పరిమళాలు నలుదిశలా వెదజల్లాలని ఆరాటపడే నేను ఆశా జీవిని.


ఓ మనసా మేలుకో ఇకనైనా

నిన్ను నువ్వు తెలుసుకో

ఆత్మ వంచన చేసుకోక

మంచితనపు ముసుగుతీసి

మానవత్వం విలువ తెలుసుకో..

మంచి మనీషిగా మారు.


శ్రీలత..

హృదయ స్పందన 



Rate this content
Log in

Similar telugu poem from Classics