నాలోని భావతరంగం
నాలోని భావతరంగం
అక్షరాలను రాశులుగా పోసి............
అందమైన పదాలతో పొందుపరచిన..........
భావతరంగమే నువ్వు............
మనసులో ప్రియ భావాలను...........
ప్రణయ కావ్యాలుగా మార్చే............
ఊహకు రూపమే నువ్వు............
ఒంపుసొంపుల సోయగాలను..........
అందంగా అభివర్ణించే రంగుల చిత్రమే నువ్వు.........
ఏ తోడు నోచుకోని ఒంటరి పయనంలో............
నీడనిచ్చే పూలచెట్టే నువ్వు............
అలసి సొలసి గాయపడిన హృదయానికి............
ఓదార్పునిచ్చే మధురకావ్యం నువ్వు.............
మదిలో తలపులన్ని పూవులుగా విరబూసి...........
పరిమళించేదే నువ్వు..............
అందమైన ఆలోచనలకు రూపమిచ్చేదే నువ్వు.........
మది కడలిలో ఎగసే భావతరంగం నువ్వు............

