నాలోని భావాలే
నాలోని భావాలే
నాలోని భావాలు తెలిపాను రాసేసి!
దాచేది లేకుండ చెప్పాను రాసేసి!
చేతిలో కలమున్న నాచేయి ఆగదు
పుస్తకము చెలిమిగా చేసాను రాసేసి!
ఏకాంత సమయాన్న ఎన్నెన్ని ఊహలో
మరుపేది రాకుండ దాచాను రాసేసి!
రచనలే చేసేసి సందేశ మిచ్చాను
కావ్యాల విలువనే చూపాను రాసేసి!
ప్రసన్నత తోడున్న బ్రతుకంత పండుగే
విలువైన గతమునే పొగిడాను రాసేసి!

