నాలో నేను... శ్రీనివాస భారతి
నాలో నేను... శ్రీనివాస భారతి


నాకు సాహిత్యం అంటే పిచ్చి
ఐతే ఇంకా ఓనమాల్లోనే
కథలంటే ఇష్టం
కదిలించే సంఘటన దొరికితే
కవితలంటే ప్రాణం
ప్రేమ పుట్టగానే కొత్త భాష వచ్చినట్టు
గమనిస్తుంటాను అన్నీ
ఎప్పటికి ఏవి ముడిసరకులోనని
ఏకాంతంలో రచనా కాంతని ప్రేమించి
ఊహల్లో అక్షర గూళ్ళు
అల్లుకుంటూ
చిన్నపిల్లాడినై పోతాను ప్రతిసారి
అందుకే ఏకాంతం నాకిష్టం
నన్ను నన్నుగా
ప్రపంచానికి పరిచయం చేసుకొనేందుకు
ఇద్దరు రత్నాలు
శ్రీనివాస్
భారతి
నా కలానికి ఊపిరి వాళ్లే.
--------$$$$$$$$$$$$---------