STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Classics

3  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Classics

నాకు ప్రేమంటే తెలియదా?

నాకు ప్రేమంటే తెలియదా?

1 min
228

నాకు ప్రేమంటే తెలియదా..

నాది ప్రేమ కాదా

గడియారంలోని ముల్లుకన్న వేగంగా కొట్టుకునే

నా హృదయాన్ని అడుగు చెప్తుంది.

నీజ్ఞాపకాలు వెంటాడుతుంటే నువు వస్తావో రావో..

ఎప్పటికైనా నిన్ను చూస్తానో లేదో అని వచ్చే కన్నీటిని తనలో ఉన్న నీ రూపం ఎక్కడ కరిగిపోతుందో అని రాకుండా ఆపుతున్న నా కంటిపాపను అడుగు చెప్తుంది.

రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచించి నిన్ను మర్చిపోవాలని.

తిరిగి ఉదయాన్నే ఆ మర్చిపోవటాన్ని మర్చిపోయి

నీ ఆలోచనతోనే మొదలయ్యే నా దినచర్యను అడుగు చెప్తుంది..

బాధ తో భారంగా..స్తబ్దంగా ..మారిన నా మనసుని అడుగు చెప్తుంది.

నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో..

నీలో నేను ఉన్నానో లేనో తెలియక.. ప్రతి రోజు నీ మాటల్లో.. నీ చూపుల్లో.. నీ మనసులో నన్ను నేను వెతుక్కోవాలని ఆరాటపడే నా ఆవేదనను అడుగు చెప్తుంది నాది ప్రేమ కాదేమో..

కొన్ని వసంతాల అన్వేషణకి ప్రతిఫలం..

కొన్ని యుగాల నిరీక్షణకు ప్రతిరూపం నా నువ్వు..

ఆ నువ్వు..

కలగా.. కల్పనగా... కథగా .. జ్ఞాపకంగా..

మిగిలిపోతావో..

నీ ప్రేమ లోగిలిలోకి నన్ను ఆహ్వానించి

ఇంకా దగ్గరగా నీ ప్రేమను

నా పంచేంద్రియాలకు పంచి 

నా హృదయాన్ని మీటి...

నా హృదయగానాన్ని వింటావో ...

శ్రీ...

హృదయ స్పందన.



Rate this content
Log in

Similar telugu poem from Romance