నాకై నేను
నాకై నేను
మదిలోనే తిష్ఠవేసావూ సరే
మెదడున కూడా నువ్వేనా మరి
తనువంతా అల్లేసావూ సరే
వేరే ఆలోచనే రానీనంటే బాగుందా మరి
నను చూడాలనే అనుకోవుగా సరే
నేనంటూ అసలు గుర్తున్నానా మరి
నిను మరిచిపోవడం మాట సరే
నీ తలపురాని క్షణమే లేదే మరి
మనషిదూరం మాట సరే
కన్నీటిభారం సంగతేమిటి మరి
మనసూమౌనం జత సరే
ఎంతదూరం ఇలాసాగాలి మరి
నాకంటూ నేను లేను సరే
నువ్వే మంటావూ చెప్పు మరి
నీవుగా పెంచిన భారం
నాకై నేను మోస్తున్నా అహరహం...

