నాకై బ్రతికేస్తున్న అమ్మ
నాకై బ్రతికేస్తున్న అమ్మ
నాకై బ్రతికేస్తున్న అమ్మ!!
.....
నిన్ను కన్నవారిని వదలి
అన్నాచెల్లెళ్ళను వదలి
పుట్టినింటిని వదలి
పుట్టింటిపేరునివదలి
నాన్నకు బానిసవై
కదిలావునీవు
నా కోసం
నన్ను బిడ్డగాపొందటం కోసం
నన్ను కనటం కోసం
నాకు అమ్మగా మారటం కోసం
నీ జీవితసర్వస్వాన్ని
నాకై త్యాగం చేయటం కోసం
** ** **
నాకు తెలుసునమ్మా
నీవు తింటున్నది బ్రతకడానికై బ్రతుకుతున్నది నాకై
ఆ బ్రతుకుని నాకై
ప్రేమగ త్యాగం చేయటానికై