నా ఊహ చిత్రం
నా ఊహ చిత్రం
నా మనసున
విరిసే విరజాజివా
పూసే పున్నగవా....!!
నా మనసుని
గుచ్చే గులాబివా
వెలసే మృదువైన మందారానివా...!!
నా మనసున
మెరిసే తారకవా
మైమరపించే మోహనరాగానివా...!!
నా మనసున
ఏర్పరచు కొనే ఊహకు ఊపిరివా
నా హృదయంలో రమించే జీవన తరంగానీవా...!!
నా మనసు
ప్రయానం చేసే గమనానికి మజిలీవా
నా జీవిత చిరునామావా...!!
ఎవరివి నువ్వు
కాస్తా చెప్పమ్మా.....!!
నా మనసులో ఒదిగిన
నా ఊహా చిత్రమా...!!

