నా సృతులు
నా సృతులు


ప౹౹
చూసానులే ఎప్పటివో ఆ పాత సృతులు
ఆనందించానులే విన్నట్లు ఎన్నో కృతులు ౹2౹
చ౹౹
పేటిక మూలలో భద్రంగా దాచిన ఓ చిత్రం
వాకిట గోడకెదురు కట్టినా వాడని విచిత్రం ౹2౹
ఎప్పటిదో ఆ ఫొటో ఎదలోనూ మెదలాడు
అప్పుడే అంకురించి కౌమార్యం కదలాడు ౹ప౹
చ౹౹
కటుంబాన్ని కూర్చి పేర్చిన ఫోటోలు ఎన్నో
కదంబమై కలిసి తీయుంచకున్నవి అవన్నీ ౹2౹
పదిమందికి చెప్పను నిలిచుండే ఆనవాలు
పదిలమై నిలిచే పదికాలాలు ఆ జ్జాపకాలు ౹ప౹
చ౹౹
పాలబుగ్గల పసితనపుచాయ ఆ ఛాయలో
పూలమొగ్గల సోయగము కెమోర లయలో ౹2౹
పాత ఫోటోలు చెప్పెనుగ ఎన్నో విషయాలు
ఏరోజైన ఎదురుగ చూపెట్టే తీపి వాస్తవాలు ౹ప౹