నా సఖి ప్రియా సఖి
నా సఖి ప్రియా సఖి
నీ చిలిపి చూపుల పలకరింపులతో
నా మనసుకి గిల్లిగింతలు పెట్టావు..
నీ చిరునవ్వుల చిరుజల్లులతో..
నా మదిలో సరికొత్త ఆశలు రేపావు..
నీ పలుకుల పదనిసలతో..
మౌనం నా భాషగా మార్చావు..
నీ అందెల సవ్వడులతో..
నన్ను నాకు మరిచేలా చేశావు..
నీ ఊహల పరవళ్ళతో..
నీ గుండెని ప్రేమగొదవరిగా చేశావు..
నీ తలపులే అణువణువుపు అయువుగా చేసిన..
నా హుదయపు ప్రతి స్పందనపు సఖివే
నా జీవితపు దివ్వె సఖియా నా ప్రియ సఖియా...

