నా సీరీ
నా సీరీ
నా పలుకు తేనెలకు..గొడుగులా నా సీరీ..!
నాశ్వాస శ్వాసలకు..గురువులా నా సీరీ..!
చైతన్య గీతాలు..పొంగించు నిత్యమ్ము..
నిజమౌన రాగాల..తరువులా నా సీరీ..!
చిరునవ్వు వీణియగ..తానుండు హృదయాన..
మెఱుపుతేనెలు నింపు..యేఱులా నా సిరీ..!
మేఘాల రథములో..గగనాలు దాటించు..
తారకల కలలింటి..మధువులా నా సీరీ.!
గంధాల కథలెన్నొ..వినిపించు చిత్రముగ..
శృంగార రసభరిత..రవములా నా సీరీ..!
శృతిలయల జతులేవొ..గతులేవొ నేర్పించు..
నిస్సంగ నిర్వేద..శివములా నా సీరీ..!
