నా ప్రియమైన నీకు...
నా ప్రియమైన నీకు...
నా నవ్వుకి చిరునామా నువ్వే నా పొగరుకు సరిజోడీ నువ్వే
నా వయసుకు వరమయ్యావే నా సొగసుకు సొబగులద్దావే
నా మనసంతా నిండిపోయావుగా మరి నువ్వేనువ్వే..
మౌనమై మరణిస్తాను నీకోసం మళ్ళీ జన్మించడానికి
వెతుకుతూ ఉన్నాను నువ్వు నాలో సగమైన నిజాన్ని..
వేచివున్నా నీ రాకకై అలసిపోతున్నా ఆలస్యానికై
చిరునవ్వు మాత్రం వీడను ప్రియతమా మాటకై...
నీమనసు కలతచెంద నామనసాగునా
నీకంట నీరొలక నాకన్ను చెమర్చదా...
నీసంతోషమే కదా నే కోరేను...
నీకష్టమేదైనా నే పంచుకోనా...
నీకేరింతల్లో నీతుళ్ళింతల్లో...
నాజీవితం ఆనందమయమేగా...
ఒక్కసారి ఇటుచూడవా మరుమల్లెలవానా...
మరొక్కసారి నవ్వవా నే ముత్యాలేరుకోనా...
దూరం పెట్టి వేడుక చూస్తున్నావు భారం మోపి బ్రతుకీడ్చమన్నావు
నేరం లేకుండా నిందలు మొయ్యమన్నావు
తీరం కనరాకుండా ప్రయాణం చెయ్యమన్నావు
కాలం కరిగిపోతుందన్నావు మౌనంలో మగ్గిపొమ్మన్నావు
శూన్యంలో కలిసిపొమ్మన్నావు నువు మరునివనుకున్నాను
నాపాలిట యమునివయ్యావు....
... సిరి ✍️

