నా ప్రియ సఖియా... !
నా ప్రియ సఖియా... !
ఎవరివో నీవు...
నా మదిని దోచిన సుందరాంగివా...
నా ఎదను మీటిన వేణు నాదానివా..
నాలోని నన్ను నాకే పరిచయం చేసిన
నా హృదయ దేవతవా...
ఎవరివో నీవు...
నా ప్రియ సఖివో..
చెలి వో..
నా నిచ్చెలివో...
మాటలే రాని నన్ను,
పాటల పూదోటను చేసావు.
పదాలే రాయలేని నాతో,
ప్రణయ కావ్యాలు రాయిస్తున్నావు..
ఎవరివో నీవు...
నా ఎద సవ్వడివా..
నా హృదయ వేదనవా...
నాలోని భావాలకు అక్షర రూపనివా..
ఎవరివో నీవు...
అంతా అనుకుంటారు
నా కవితలు చదివి
నేను ప్రేమిస్తున్నాను అని..
నీకు తెలియదా!
నేను ప్రేమించేది నిన్నే అని.
మరి చెప్పవే... లోకానికి
నా చిలిపి కన్నుల
కావ్యనాయికా..
చెలియా...
నా ప్రియ సఖియా... !
శ్రీ....
హృదయ స్పందన...

