నా ప్రేయసి
నా ప్రేయసి
నా ప్రేయసి
ప్రేయసి కోసం మనసులో ఉన్నది అనురాగం,
అంతరంగంలో ఉపక్రమించింది ప్రణయరాగం,
తన ప్రతి మాట పాట అనిపించెను ఒక సరాగం,
మానసవీణ ఉదయించి పలికెను భూపాల రాగం ।౧।
తన అభినవ రూపం చూసి మదిలో కలిగెను మోహం,
సహించలేను ఇక రమ్యమైన రూపసి అభావం విరహం,
నా మానసిపై నిరంతరంగా పెరుగుతోంది వ్యామోహం,
నా జీవితంలో వచ్చింది ప్రీతికరమైన ప్రేమ-ప్రవాహం |౨|
చూడలేను నా శ్రేయసి నయనాలలో ఆగ్రహం,
నా పైన ఉండకూడదు ఎటువంటి సందేహం,
హృదయంలో స్థాపించాను అపురూప విగ్రహం,
అనుబంధం కోసం ఆశించెను ఆమె అనుగ్రహం |౩|