నా ప్రేమను
నా ప్రేమను
మాటలలిగి కూర్చున్నవి..తెల్పుటెలా..నా ప్రేమను..!
మనసు మాయ చేస్తున్నది..పలుకుటెలా..నా ప్రేమను..!
నా తలపుల విందంటే..ఎంతిష్టమొ..మౌనానికి..
నీ పెదవుల రాగాలకు.. నింపుటెలా..నా ప్రేమను..!
గుండెలయల సరిగమలకు..ప్రాణమంటె..నీవేలే..
నీ అందెల రవళి లాగ..మార్చుటెలా.. నా ప్రేమను..!
పరిమళించు ఈ గాలికి.. కోపమసలు..లేదు కదా..
కవ్వించే నీ కురులకు.. చెప్పుటెలా..నా ప్రేమను..!
కల్పనలకు రూపమిడే..ఉలికదలిక..మధురములే..
ప్రాణశిల్ప నాట్యముగా..మలచుటెలా..నా ప్రేమను..!

