నా ప్రేమ కధనం
నా ప్రేమ కధనం
తన పయనం చర్విత చరణం, తన మననం అమృత గమనం,
తన అందం అందని గణనం, తనకంకితం ఈ వలపు కవనం ...
చూడలేక నా హృదయ మదనం ఓపలేక తన కలల కదనం,
చేయలేక నా తలపుల ఖననం తెలుపక తప్పని నా ప్రేమ కధనం ...
తన మదిన వేల ఆలోచనల నర్తనం,తన మౌనాన నా మస్తిష్క దహనం,
తన అంగీకారాన జరిగె పెను సంచలనం,తన అధరముతో నా పెదవుల చిలిపి సంభాషణం .

