💕 నా ప్రాణమా 💕
💕 నా ప్రాణమా 💕
నాభుజాన పసిపాపల్లే నువ్వు
నీనుదుట తిలకమల్లే నేను
నాఎదపై పచ్చబొట్టల్లే తలవాల్చి నువ్వు
నీ గుండెల్లో చోటే వరమని నేను
ఇరువురం ఏకమైన ఈక్షణం...
నీమోమును చూస్తే నాకన్నులు మతాబులు
నీనవ్వులుచూస్తే పున్నమి వెలుగులు
నీతోనడిస్తే వెన్నెల పువ్వులు
నీచేతిని తాకితే తెలియని తమకాలు
నీగుండెనవాలితే సత్తువ ఖజానాలు
నీలో కలిసిపోతే నాబ్రతుకున వసంతాలు...
వానలో తడవకుండా వస్త్రాన్ని
చీకటికి భయపడనీయక నీచేతిని
మనసుకి స్వాంతనగా నీ ప్రేమని
నిదురరాని తనువుకు జోలని
నీడవై వెన్నంటివున్న నీకు
చెప్పునేను తిరిగి ఏమివ్వగలనని నా ప్రాణమా...

