STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance Fantasy

4  

Dinakar Reddy

Abstract Romance Fantasy

నా పెరట్లో వాడిపోని పూలు

నా పెరట్లో వాడిపోని పూలు

1 min
300

మందారాలూ మల్లియలూ

కనకాంబరాలూ డిసెంబరాలూ

చామంతులూ సన్నజాజులూ

సంపెంగలూ మరెన్నో పూలూ


ఏవీ వాడిపోవట్లేదు

నా కోరికల్లానే

వేటి సువాసనా చెక్కు చెదరట్లేదు

నా యవ్వనపు ఆలోచనల్లానే


ఇక ఇన్ని పూలూ ఏం చేయను

నువ్వు రాకుంటే అన్నీ వృథా

ఈ పూలూ ఆ హొయలు

నా వలపు ఆ వయసు


అన్నీ వృథా

మరెప్పుడు వస్తావ్

నా యవ్వనాన్ని మరలా ఎప్పుడు జీవింపజేస్తావ్


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract