Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

3  

ARJUNAIAH NARRA

Abstract Children Stories Children

నా పేరు రాజస్థాన్

నా పేరు రాజస్థాన్

1 min
231


నా పేరు రాజస్థాన్ 

నేను వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. 

నా రాజధాని జైపూర్ నగరం.

నా అధికార బాషలు-హిందీ, రాజస్థానీ,గుజరాతీ

నా పక్షి బట్టమేక పిట్ట


నా సరిహద్దులు

పశ్చిమాన పాకిస్తాన్ దేశం,

నైఋతిన గుజరాత్, 

ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, 

ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, 

ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్


నా ప్రధానమైన భౌగోళిక అంశం థార్ ఎడారి. 

ఆరావళీ పర్వత శ్రేణులు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. 


నా జాతీయ ఉద్యవనాలు

కియోలాడియో జాతీయ ఉద్యానవనం

మౌంట్ అబూ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం

రణథంబోర్‌ జాతీయ ఉద్యానవనం

సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం

రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయం, 

భరత్ పూర్ పక్షి ఆశ్రయం


నేను చారిత్రిక కట్టడాలకూ ప్రసిద్ధి భారతదేశంలో యాత్రికులను బాగా ఆకర్శించే జైసల్మేర్ కోట


నా పర్యాటక ప్రదేశాలు

జైపూర్ లోని ప్యాలెస్ లు, ఉదయపూర్ సిటీ ప్యాలెస్, ఉదయ్ పూర్,అల్వార్ లోని సరస్సులు మరియు కోటలు జోధ్ పూర్(నీలి భవనాలు), బికనీర్, జైసల్మేర్ లలోని ఎడారి కోటలు షెఖావతి ప్రాంతం(ఆర్ట్ ) బుండి, ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా నిలిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయ వనరుల్లో పర్యాటకం 8శాతం ఈ రంగం నుండి వస్తుంది


నా మందిరాలు

బ్రహ్మ మందిరం: ఆజ్మీర్ వద్ద పుష్కర్‌లో ఉంది. సృష్టికర్త బ్రహ్మను పూజించే మందిరం ఇదొక్కటే.


అచలేశ్వర్ మహాదేవ మందిరం: మౌంట్ అబూ వద్ద అచల్‌ఘర్‌లో ఉన్న శివాలయం. ఈ మందిరం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ శివలింగం బదులు శివుని మడమ శిల్పం, ఇత్తడి నంది విగ్రహం ఉన్నాయి.


ఆదినాధ్ మందిరం: ఉదయపూర్ సమీపంలో రిఖాబ్‌దేవ్ వద్ద నున్న జైన మందిరం. 

బిజోలియా మందిరాలు: బుంది వద్ద బిజోలియాలో ఉన్న మందిరాల సమూహం. దాదాపు 100 మందిరాలలో మూడు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి.

నాథ్‌ద్వారా : ఉదయ్‌పూర్‌కు 48 కి.మీ. దూరాన ఉన్న రాజసమండ్ జిల్లాలో ఉన్న శ్రీనాధ్‌జీ మందిరం. పుష్టిమార్గం అనుసరించేవారికి పూజాస్థలం.

అంబికామాత మందిరం: ఉదయపూర్‌కు 50 కి.మీ. దూరంలో మౌంట్ అబూ వద్ద జగత్ గ్రామంలో ఉన్న దుర్గాదేవి మందిరం.


నా నగరాలు ఉదయ్ పూర్, పుష్కర్,మౌంట్ అబు, అజ్మీర్, జైపూర్(పింక్ సిటీ), జైసల్మేర్ (గోల్డెన్ సిటీ) హనీమూన్ జంటలకు శృంగారభరితమైన ప్రదేశంగా పేరుంది 



Rate this content
Log in

Similar telugu poem from Abstract