నా మనసు దోచినవే
నా మనసు దోచినవే
చెలియా...........!!!!!!
మల్లెలు కొప్పున
తొడిగిన కోమలాంగీ..!!
వెన్నెల కాంతి పూత పూసిన
తెల్లని చీరలో..!!
కలువ కన్నుల
పాలరాతి శిల్పంలా....!!
అద్భుతమైన అచ్చ తెలుగు అందాల భామ లా..!!
ఆనందాన్ని పంచె అపురూపమైన అమని లా..!!
అందాలను అరబోసిన బాపు బొమ్మ లా ..!!
ముద్దు లొలికే ముద్ద మందారం లా..!!
నీ అందం తో ముచ్చెమటలు పుట్టిస్తున్నావే "సఖి"
చిరునవ్వుల చిత్రమాలిక లా
"నా మనసు దోచినావే ..!!
మనోహర మణిహారమా..!!
నీకు ఇది న్యాయమా...!!??

