నా మది...
నా మది...
ఈ క్షణానికి తొందరెందుకో
రెప్పపాటులో కరిగేది ఎందుకో
అరె .... నా మది మహానదై ఉరుకుతుండగా
ఆగితే బావుండుగా కాలం కొద్దిగా
గుప్పెట్లో పట్టుకోవాలని ఆశ కలిగెగా
ఏనాటికి మరుపే రాని జ్ఞాపకాలుగా
ఉంటా నీతో నీ స్మృతి పధంగా
అంటూ జింకపిల్లలా చెంగుమందిగా
ఆపలేని పరుగులే సాక్ష్యమవ్వగా
ఓపలేని హాయినే మనసు మోయగా
నిమిషమైన చాలులే తీపి ఎదను నిండగా
గుర్తుండిపోయే సమయమే పెదవిపైన నవ్వుగా....
... సిరి ✍️

