నా లాహిరి
నా లాహిరి
అర విరిసిన లావణ్యమా
నీ చూపులే నా ఊపిరి
మది దోచిన మధువనమా
నీ నవ్వులే నా లాహిరి
చిరునవ్వుల నవరాగమా
నీ పలుకులే ఓ వరమా
దివి నుండి భువికి ఏతెంచిన వరమా
నీ సొగసు చూడ తరమా
అనునిత్యం మనసును కదిలించే..........
అమర స్వరమా
ఈ జన్మకు నిను మరువడం నా తరమా
నీ మానస సంద్రంలో ఎగిసే అలనై
నీ నీలిగగనపు అంచులలో విహరించే........
విహంగాన్నై
నీ కలల లోకంలో చెదరని కలనై
నీ అధరాలపై ఎప్పటికీ చెరగని చిరునవ్వునై
నీ తలపులలో నే విరజాజుల బాసనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ ఎద చప్పుడు నేనుగా
నీ అడుగులో అడుగునై
నీతో నడచిరానా
మరు జన్మకు తోడు కానా
నీతో ఇలా నేనుండిపోనా

