నా కలతను
నా కలతను
నీవుగాక ఏ జాబిలి..మాన్పలేదు నా కలతను..!
నీకోసం గాకుండా..వ్రాయలేను ఏ పాటను..!
నీ తలపుల తేనెమంచు..వానలోన ఉండిపోదు..
ఎక్కడనో ఏమిచేయ..నా మనసిక ఏం పెట్టను..!
మండుతున్న చితికూడా..ఒకవెన్నెల పొదరిల్లే..
అనిమిషనై నీతోనే..బ్రతికిపోదు ఏం చెప్పను..!
శిలగా మారక తప్పని..స్థితిలో ఉలితో స్నేహం..
ప్రాణశిల్ప సుందరినై..మౌనముగా నవ్వగలను..!
వినోదించు మిషతోనే..విషయజగతి విలాసమా..
గంధవీణ రాగజలధి..స్వరసుధనే వీడగలను..!
