నా జీవిత లక్ష్యం
నా జీవిత లక్ష్యం


సాగిపోవుటె బ్రతుకు -ఆగిపోవుటె చావు
గమ్యం ఉంది ముందర -సాధించుకో తొందర
లక్ష్యం లేని పుట్టుక- ఉండడం భూమిపై దండగ
ప్రాణం అనేది ఉండగా- మరణాన్ని జయించవచ్చుగా
బాధ్యత తెలిసిననాడే - బంధువు అవుతుంది బరువు
బరువు అనుకున్నావంటే -అవుతుంది బ్రతుకు కరువు
బరువు,కరువు లేనివాడికి- ఉండదు కదా బ్రతుకుతెరువు
కష్ట సుఖాలు ఎరిగిన మనిషికి కన్నీరే రాదుగా
నాన్న తర్వాత నాన్నగా- ఉండాలి కుటుంబానికి అండగా
అమ్మ తర్వాత అమ్మగా- నడపాలి ఇంటిని అందాల హరివిల్లుగా
అక్కలా పంచాలి ప్రేమానురాగం, చెల్లిలా చూపించాలి మమకారం
అప్పుడే ఇల్లు అవుతుంది ఆనందాల బృందావనం.