STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"నా ఈ ప్రపంచం"

"నా ఈ ప్రపంచం"

1 min
318

ఈ సమాజానికి నేను లోకువ...!!

ఇప్పుడున్న కొత్త కల్చర్ కి అలవాటు పడి పరిగెత్తలేక,

ఆ పాత కాలపు ఆలోచనలతో ఇంకా నడుస్తున్నాని.


ఈ సమాజానికి నేను లోకువ...!!

దృశ్యమాధ్యమ నటనలకు అలవాటు పడిన ఈ ప్రపంచంలో,

నాకున్న వాక్చాతుర్యంతో ఓ కొద్ది మందిని నా రచనల వైపు తిప్పుకుంటున్నానని.


ఈ సమాజానికి నేను లోకువ...!!

నమ్మిన సన్నిహితులే మోసం చేస్తున్నారని తెలిసినా,

ద్రోహం తలపెట్టిన శత్రువులను సైతం దరికి చేరనిస్తున్నాని.


ఈ సమాజానికి నేను లోకువ...!!

అయినవాల్లందరూ దూరంపెడుతుంటే,

ఏమి కానివాళ్ళకోసం వెంపర్లాడుతున్నానని.


ఈ సమాజానికి నేను లోకువ...!!

ఎవరెవరో చేసిన తప్పులకు, పొరపాట్లకు,

శిక్షంతా నే అనుభవిస్తూ సర్దుకుపోతున్నానని.


ఈ సమాజానికి నేను లోకువ...!!

చుట్టున్న పరులుకు సంతోషం లాంటి వెలుగును పంచడం కోసం,

కొవ్వొత్తిలా నే అనుక్షణం కరుగుతూ దిగజారుతున్నానని.


ఈ సమాజానికి నేను లోకువ...!!


నేనీ సమాజానికి లోకువైనా, నాకీ సమాజమంటే మక్కువే!


బహుశా ఈ సమాజానికింకా ఏదో చెయ్యాలనే తాపత్రయం కాబోలు!


అందుకే ఇంత వ్యతిరేకతున్నా ఇంకా బ్రతికున్నది!!


సత్య పవన్ ✍️

#ADeepThinker



Rate this content
Log in

Similar telugu poem from Classics