నా హృదయం
నా హృదయం
నా హృదయంలో నిను
కొలువుంచుకుని...!!
నీ హృదయంలో చోటుకై
నిరీక్షిస్తున్నా...!!
నీ అనుమతి కోసం అణుక్షణం
ఎదురు చూస్తూ అహర్నిశలు
అలసిపోతున్నా...!!
నీవు కరుణిస్తావనే ఆశతో...!!
ఆ ఆశతోనే అణువంత నా ప్రాణాన్నీ అరచేతిలో పట్టుకుని ఉన్నా...!!
అలసిన నా హృదయం
అంతరించే నా శ్వాసతో...!!
కలత చెందిన కనులు
మూసుకు పోయే క్షణం
ఇపుడో అపుడో ఎపుడో...!!??
కాని అప్పటిలోగా ఒక్కసారి అయినా నన్ను అక్కున చేర్చుకోవా..!!??

