నా అడుగులు
నా అడుగులు
నా అడుగులు నీవెంటే కదుపుతున్నా ఎందాకో ఈ పయనం తెలియకున్నా నీ కోసం నా ప్రాణం నిలుపుకున్న గమనం లేని పయనంతో నిన్ను వెతుకుతున్న మౌనంగా నీకోసం నిరీక్షిస్తున్నా కాలo ఆడే ఆటలో చిక్కుకున్నా నీ అడుగుల దారులు నీ గుర్తులు తెలుపుతున్న నీ మనసులో ఉన్న గుర్తులు నేను చదవకున్నా నా మనసే నీ కోసం తపిస్తున్న నీ లోకం నా కోసం కాదంటే భరించకున్నా నీ అడుగుల జాడలు ఎందాకా నడిచి వెళ్ళిపోయాయో తెలియక ఇక్కడే వేచి చూస్తున్నా నీకోసం ఎదురు చూస్తూ.బంగారం ఓ చోట నా కవితలు.. దొరికాయి వాటికీ నా పేరు పెట్టి లేవు.. భావాలు అయితే నావేగా తిరిగి తెచ్చేసుకున్న ఎందుకంటే అప్పటిలో ఎంత బాగా రాసేదాన్నో నాకే తెలుసు గనుక నా ప్రతీ అక్షరం నా హృదయ పుటల్లో నిక్షిప్తం కనుక
