STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మయూరి

మయూరి

1 min
3

గగనాన జాబిలిలా  
వెన్నెలలు విరజిమ్మనా !!
మబ్బులోని చినుకులా 
జారి నేలపై వాలనా !!!
గువ్వలాగా ఆకాశానికి 
ఎగిరిపోనా గోరింక కోసమై !!!
కోండపై నుంచి జలపాత 
ఝరిలా ఉరకనా లోయ లోనికి 
సంకెళ్ళు తెంచుకుని స్వేచ్ఛగా !!!
నింగిలోనికి దూసుకెళ్ళనా చిలుకనై !!!!!! 
అను రాగ వీణలో రాగాలు మీటి 
సరిగమలే పలికించనా !!!!!! 
వాన వెలిసిన ఆకాశాన 
ఏడేడు రంగుల మెరిసేటి 
ఇంద్ర ధనస్సునై వెలిగిపోనా !!!
నింగీ నేలలా ఒకరికి ఒకరూ !!
తోడు నీడలా చీకటి వెలుగుల్లా !!
సూర్యచంద్రుల్లా పగలు రేయిలా !!
కడలికి అలనై వీడక మసలుదామా !!
తామరాకుపై నీటిబొట్టులా జారేనా !!!
వాలిపోతున్న మెుక్కజొన్న కంకిలా !!!
కోనేటి కలువనై నీటిపై తేలుతూ
దరహస చంద్రునికై వేచి చూడగా !!!!!
శశిధరుడు ధవళకాంతులతో ఆకాశాన
ప్రకాశిస్తూ గగనాన ధరిత్రిపై వెలుగులు 
పంచుతూ వర్షం వెలిసిన తర్వాత 
మయూరిలా పురి విప్పి ఆడెనే !!!!
        
          


Rate this content
Log in

Similar telugu poem from Classics