క్షణకాల మాయ...??!
క్షణకాల మాయ...??!
మిథ్య రూపమును నమ్మి మైమరిచిపోకుమా...
మట్టి ప్రాణమైన వేళ మౌనమే తుది పాటరా!
రేపటి గమ్యం ఎరుగక సాగేటి సమయమా,
చూచేటి ప్రతి దృశ్యమూ క్షణకాల ఛాయరా...
పసిడి మెరుపుల వెనుక దాగున్న నీడను చూడు,
అహంకారపు శిఖరము మంచులా కరిగిపోవును నేడు.
చేతిలోని ప్రాణవాయువు పరమాత్మ అప్పురా,
తీరిపోయే రోజున ఏదీ నీ సొత్తు కాదురా!
బంధాలన్నీ ప్రయాణంలో విరిసిన పువ్వులే,
తీరం చేరేంత వరకే సాగేటి అలలే.
రాలిపోయే ఆకులా రాలిపోయే జీవుడా,
ఆత్మ దీపం వెలిగించి అంతరంగం చూడరా!
కాయ మాయమై పోయినా మిగిలేది నీ గుణమేరా,
చేసిన నిస్వార్థ త్యాగమే నీ వెంట వచ్చే ధనమురా.
ద్వేషమనే కంటిపాపను మైత్రితో కడగరా,
శాశ్వతమైన ప్రశాంతతలో నిశ్చలంగా నిలవరా!
