మనవాళ్లు
మనవాళ్లు
ఆస్తిపాస్తులు పోతే
మళ్ళీ సంపాదించగలవు.
ఈరోజు బాధపడితే
ఏదో రోజు నవ్వుతావు.
ఓడిపోతే మళ్ళీ గెలుస్తావు.
ఒంటరిగా ఉంటే
కుటుంబ సభ్యులు ఆ లోటును తీరుస్తారు.
బాధ పడితే ఎవరో ఒకరు ఓదారుస్తారు.
నీకంట కన్నీరు కన్నీరు చిందితే ఏ చేతులో వచ్చి కన్నీళ్లు తుడుస్తారు.
ధైర్యాన్ని నూరిపోస్తారు
భరోసాని కల్పిస్తారు.
బాధ్యతల గురించి వివరిస్తారు.
నిజాన్ని చెబుతారు.
హితబోధ చేస్తారు.
మంచి చెప్పేవాళ్ళు మనవాళ్ళు.
మంచివాళ్ళు దొరకడం అదృష్టం.
ఆమాటలు వింటే గొప్పవాళ్ళు అయిపోతాం.
మంచివాళ్ళను మనతో కలుపుకుపోవాలి.
చెడ్డవాళ్ళను వందరూపాయలు ఖర్చుపెట్టి
దూరం చేసుకోవాలి నీజీవిత ప్రయాణంలో..
