కదా మరి
కదా మరి
అప్పులేని జీవితమే ఐశ్వర్యం కదామరి
చెప్పలేని వ్యధలుంటే దౌర్భాగ్యం కదామరి
◦
దైవానికి నైవేద్యం ఎపుడైనా పెడతావు
పగవారికి ఉపకారం పరమార్థం కదామరి
చదివేందుకు నీముందర పుస్తకాలు ఎన్నెన్నొ
విజ్ఞానపు సముపార్జన ఋజుమార్గం కదామరి
వున్నదాంతొ తృప్తి పడితె దాహానికి తావేది
అన్యాయపు సంపాదన ధనదాహం కదామరి
చేతిలోన చేయివేసి విడవనంటు పలికావు
దూరదేశ పర్యాటన చెలివిరహం కదామరి
