STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రతి రాత్రి

ప్రతి రాత్రి

1 min
6


అందమైన వెన్నెలలో..తిప్పుతుంది ప్రతిరాత్రి..!
అమ్మప్రేమ వెన్న తాను..పంచుతుంది ప్రతిరాత్రి..!

నీ ప్రేయసి ఎవరంటూ..అడగవద్దు పొరపాటున..
తారలతో మాట్లాడుట..నేర్పుతుంది ప్రతిరాత్రి..!

బతుకులోన సంజవెలుగు..నింపు తపసు తనదేలే..
నా మనసుకు దుప్పటిలా..మారుతుంది ప్రతిరాత్రి..!

మనషిజన్మ గొప్పవరం..అనేమాట రుజువు చూపు..
మధురమైన మౌనంలో..నిలుపుతుంది ప్రతిరాత్రి..!

నిద్ర ముంచుకొచ్చేలా..తలనిమిరే చెలి తానే..
కలల వీధి తిరునాళ్ళే..చూపుతుంది ప్రతిరాత్రి..!

నా ఆశల పందిరి తను..ఆశయాల చెట్టు తనే..
పొద్దున్నే నామత్తును..దులుపుతుంది ప్రతిరాత్రి..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics